20-07-2025 12:49:29 AM
మైనంపల్లి హన్మంత రావు
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నరం లేని నాలుక మాదిరిగా కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శిం చారు. ఇంటికి ఇంటికి ఉద్యోగం, దళిత సీఎం, దళితులకు భూములు ఇస్తామంటూ మోసం చేశారన్నారు.
డబుల్ బెడ్ రూం అంటూ బీఆర్‌ఎస్ పాలనలో కాలయాపన చేస్తే.. సీఎం రేవంత్ పెద్దమనసుతో డబుల్ బెడ్ రూమ్ కట్టిన వాళ్ల కోసం రూ.9 వేల కోట్లు నిధులు కేటాయించారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌తో సినీ, ప్రజాప్రతినిధుల కుటుంబాల్లో చిచ్చుపెట్టారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌తో తన గన్‌మెన్లు, కుటుంబసభ్యుల ఫోన్లు కూడా వదల్లేదన్నారు.
బీఆర్‌ఎస్ హయంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. మర్యాదగా మాట్లాడితే కేటీఆర్‌కి అర్థం కావడం లేదన్నారు. కేటీఆర్ జీవితంలో సీఎం కాలేడని పేర్కొన్నారు. తమను రెచ్చగొడితే దాడులు చేస్తామని హెచ్చరించారు.