calender_icon.png 20 July, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ బ్రాయిలర్ కోడి.. రేవంత్‌రెడ్డి నాటు కోడి

20-07-2025 01:19:30 AM

  1. రేవంత్‌రెడ్డిని కేటీఆర్ తట్టుకోలేడు
  2. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): విదేశాల్లో చదువుకున్న కేటీఆర్ అత్యంత నాజూకు నాయకుడని, బ్రాయిలర్ కోడిలాంటి కేటీఆర్... నాటు కోడి లాంటి రేవంత్‌రెడ్డిని తట్టుకోలేడని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. అనవసరంగా రేవంత్‌రెడ్డిని రెచ్చగొట్టి ఇబ్బంది పడవద్దని కేటీఆర్‌కు సూచించారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పదే పదే సీఎం రేవంత్‌రెడ్డిని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

కేసీఆర్ కుట్రపూరిత రాజకీయాలలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి బెడ్‌రూమ్‌లోకి పోలీసులను పంపినప్పుడు కేటీఆర్ సంస్కారం, విలువలు ఎటు పోయాయని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏ పోలీస్ అయినా బీఆర్‌ఎస్ నేతల బెడ్ రూమ్‌లోకి వెళ్లారా అని అడిగారు. ఎస్కార్ట్ పక్కనబెట్టి రేవంత్ బయటకు వస్తే.. కేటీఆర్ తట్టుకోలేడన్నారు.

తెలంగాణ ప్రజల హక్కుల కోసం కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లారా అని ప్రశ్నించారు. బట్ట కాల్చి సీఎంపై, మంత్రులపై వేస్తానంటే ఊరుకోబోమని హెచ్చరించారు. కేటీఆర్‌కు పదవి పోయాక పదవి లేదనే స్ట్రోక్, ఒకవైపు చెల్లెలి స్ట్రోక్, మరోవైపు బావ స్ట్రోక్ వచ్చిందంటూ విమర్శించారు. రాష్ర్టంలో రేవంత్‌కు ఉన్న క్రేజ్.. కేటీఆర్‌కు ఎప్పటికీ రాదన్నారు.