19-07-2025 08:16:15 PM
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పరిషత్ పీఠాన్ని బిజెపి గెలుచుకోవాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం బిజెపి జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల కార్యాశాల సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలుచుకునే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఇద్దరు సీఎంలను ఓటమి చేసి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కామారెడ్డి ప్రజలు గెలిపించారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి నాయకులు గట్టిగా కృషిచేసి బిజెపి అభ్యర్థులను గెలిపించాలన్నారు. జెడ్పి పీఠాన్ని కమలం కైవసం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన బిజెపి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంది అన్నారు.