calender_icon.png 3 December, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనంతగిరిలో చిరుత కలకలం

13-02-2025 12:00:00 AM

వికారాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాం తి) : వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో చిరుత సంచారం స్థానికులను, పర్యాట కులను భయాందోళనకు గురిచే స్తుంది.  మంగళవారం అర్ధరాత్రి అనంతగిరి గుట్టలోని ఓ ఘాట్ రోడ్డులో చిరుత రోడ్డు దాటుతుండగా వాహనదారులు వీడి యోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చిరుత సంచారం వైరల్ అయిం ది.

ఈ మేరకు బుధవారం అటవీశాఖ అధికారులు చిరుత ఆనవాళ్ళ కోసం పలుచోట్ల అన్వేషించారు. చిరుత సంచరిం చిన ఘాట్ రోడ్డు మాత్రం అనంతగిరిదేనని అయితే, చిరుత పాద ముద్రలు ఎక్కడ లభించలేదని అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రయాణికులు, పర్యాటకులు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు.