calender_icon.png 20 July, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

19-07-2025 08:22:31 PM

సమాజం పురోగమనానికి శాస్త్రీయ ఆలోచనలతో ముందుకు సాగుదాం..

ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవేటి సరళ పిలుపు..

ఖమ్మం (విజయక్రాంతి): అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం రెండవ రోజు రాజకీయ శిక్షణ తరగతులు ఖమ్మంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు 100 రోజుల్లో నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తానని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగాన్ని రూపుమాపుతానని, నల్లధనాన్ని వెలికి తీస్తానని, బేటి పడావో బేటి బచావో నినాదాలతో స్వచ్ఛ భారత్ మేక్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, నినాదాలతో అధికారంలోకి వచ్చిందని కానీ నేడు ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని అమ్మేసిందని నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని, ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేశారని, అంబానీకి అదానికి దోచిపెడుతున్నారని అన్నారు. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులను కార్మికులను అనేక బాధలకు గురిచేసారని ఆమె అన్నారు.

మోడీ మతోన్మాద విధానాలతో కులాల మధ్యన, మతాల మధ్యన, విభజన తెచ్చి సమాజ తిరోగమనానికి పాల్పడుతున్నాడని ఆమె విమర్శించారు. నేటి సమాజం మూఢనమ్మకాలు అశాస్త్రి ఆలోచనలతో ఉన్నదని మహిళలు శాస్త్రీయ ఆలోచనలతో సమాజాన్ని ముందుకు నడిపించాలని దోపిడీ సమాజాన్ని మార్చాలని ఆమె మహిళలకు విజ్ఞప్తి చేశారు. రద్దు చేసిన గ్యాస్ సబ్సిడీని కొనసాగించాలన్నారు. మద్యం బెల్ట్ షాపులను రద్దు చేయాలన్నారు. అనంతరం మూఢనమ్మకాలు, శాస్త్రియ ఆలోచన క్లాసును అలవాల నాగేశ్వరావు బోధించారు. భవిష్యత్ కర్తవ్యాలను సంఘం రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి బోధించారు. ఈ క్లాసులకు సంఘం జిల్లా కార్యదర్శి బండి పద్మ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు రమణ, ఆఫీస్ బేరర్స్ ఎండి మెహ్రూనీసాభేగం పి.నాగసులోచన, పి ప్రభావతి ,పి సుమతి, శీలం కరుణ కే అమరావతి ,జి సునీత, జి రజిత, బెల్లం లక్ష్మి, ఐద్వాజిల్లా, మండల,నాయకురాలు పాల్గొన్నారు.