calender_icon.png 21 July, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాబురావుకి శ్రద్ధాంజలి ఘటించిన మడత వెంకట్ గౌడ్

20-07-2025 11:07:02 PM

ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ఇల్లందుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబురావు అనారోగ్యం మృతి చెందారు. ఇల్లందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాబురావు ఆత్మ శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, వ్యక్తిగతంగా రాజకీయపరంగా తనకు వెన్ను ధన్నుగా నిలిచేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.