19-07-2025 08:30:28 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోనీ మహాలక్ష్మి ఆలయంలో ఆదివారం జరిగే బోనాలకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila)ను గుడి చైర్మన్ కొడకల శ్రీకాంత్ శనివారం కలిసి ఆహ్వానించారు. అలాగే మేడిపల్లి నుండి వచ్చే ఊరేగింపుకు భద్రతను ఇవ్వాలని కోరారు. ఆలయ ఆవరణలో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఇచ్చి ఎలాంటి సంఘటన జరగకుండా చూడాలని కోరారు. ఈయన వెంట బోయవాడ కౌన్సిలర్ చైతన్య, బంగల్ పెట్ యూత్ అధ్యక్షుడు పెండం శ్రీనివాస్, సభ్యులు రామ్ రాజ్, ఆడప శ్రీకాంత్ ఉన్నారు.