calender_icon.png 19 July, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహంకాళి బోనాల జాతరను విజయవంతం చేయాలి

19-07-2025 05:17:48 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని బురదగూడెం త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో ఆషాఢ మాసం బోనాల జాతరను విజయవంతం చేయాలని ఆలయ అర్చకులు సతీష్ భవాని తెలిపారు. ఆలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆషాడమాసంను పురస్కరించుకొని ఈనెల 20న ఆదివారం బోనాల జాతర నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని బోనాల జాతరను విజయవంతం చేయాలని కోరారు. కామాఖ్య ఆలయంలో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని ఈ బోనాల జాతరకు ప్రతి ఇంటి నుండి బోనాలతో వచ్చి అమ్మ వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.