calender_icon.png 19 July, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 23న రాష్ట్రవ్యాప్త బంద్ ను విజయవంతం చేయండి

19-07-2025 05:56:37 PM

ములకలపల్లి (విజయక్రాంతి): ఈనెల 23న జరిగే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ మండల నాయకులు సోహిల్ కోరారు. శనివారం మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలకు స్వంత భవనాలు లేక అద్దె భవనాల్లో గురుకుల పాఠశాలలను నిర్వహిస్తున్నారని స్వంత భవనాలు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మెస్, కాస్మెటిక్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా రంగ సంస్థలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉచిత బస్ పాసులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాను ప్రకాష్, రంజిత్, మహేష్, శశి చందర్, అనిల్, కార్తీక్, చందు, తదితరులు పాల్గొన్నారు.