calender_icon.png 2 December, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సేవలు సద్వినియోగం చేసుకోవాలి

12-02-2025 10:39:35 PM

బాలానగర్ డిసిపి సురేష్ కుమార్...

మేడ్చల్ (విజయక్రాంతి): బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాలనగర్ డిసిపి సురేష్ కుమార్ అన్నారు. బుధవారం కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ లో నూతన బ్రాంచ్ ను జోనల్ మేనేజర్ జి.ఎస్.డి ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ... నూతన బ్రాంచ్ ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కస్టమర్లకు సత్వర సేవలు అందుతాయన్నారు. 28 రాష్ట్రాలు ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 30 మిలియన్ల కస్టమర్ ఉన్నారన్నారు.

తెలంగాణలోని 33 జిల్లాల్లో 71 బ్రాంచీలు ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని బ్రాంచీలు ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎంఎస్ఎంఈ, వ్యవసాయ తదితర రుణాలు అందిస్తామన్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మేడిశెట్టి ఉష, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.