calender_icon.png 20 July, 2025 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో రైల్వే నెట్‌వర్క్ భారీగా పెంపు

20-07-2025 01:21:42 AM

  1. కొత్త రైలుతో చిరకాల వాంఛ నెరవేరింది 
  2. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
  3. కాచిగూడ రైలు ప్రారంభం
  4. రీజినల్ రింగ్ రైల్‌తో ఇబ్బందులు తీరుతయ్
  5. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యం భారీగా పెరుగుతోందని, ఫలితంగా రవాణా మరింత మెరుగవుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దేశంలోని అన్ని ప్రధాన స్టేషన్లతో పాటు ఇతర స్టేషన్ల ను సైతం ఆధునికీకరిస్తున్నామని చెప్పారు.   సికింద్రాబాద్ తరహాలో దేశవ్యాప్తంగానూ రైల్వే స్టేషన్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

రీజిన ల్ రింగ్ రైల్ వల్ల రైళ్ల రాకపోకల ఇబ్బందులు తీరుతాయని కేంద్రబొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం  కాచిగూడ రైల్వేస్టేషన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి జెండా ఊపి కాచిగూడ భగత్ కి కోఠి (జోధ్‌పూర్)కు నూతన రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు.

అనంతరం ఆయన  మాట్లాడుతూ  హైదరాబాద్ నుంచి రాజస్థాన్ నేరుగా చేరుకునేందుకు రైలు సౌకర్యం కల్పించాలని గత 40 ఏళ్లుగా డిమాండ్ ఉందన్నారు. కేంద్రమత్రి కిషన్ రెడ్డి ఈ రైలు కోసం చాలా రోజుల క్రితం నుంచి తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సైతం హైదరాబాద్ నుంచి రైలును కోరారని తెలిపారు.

హైదరాబాద్‌లో ఉన్న రాజస్థాన్ ప్రజలు తమ స్వరాష్ట్రం చేరుకునేందుకు ఈ రైలు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఏళ్లుగా ఉన్న డిమాండ్ పరిష్కారం అవ్వడం సంతోషకరమైన విషయమన్నారు. మరోవైపు ఈ రైలును అహ్మదాబాద్ మీదుగా నడిపించాలని పలువురు కేంద్రమంత్రి దృష్టి కి తీసుకురాగా.. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేష న్ తరహాలోనే అహ్మదాబాద్ స్టేషన్‌లోనూ పెద్దఎత్తున ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని..

అందుకే అహ్మదాబాద్ మీదుగా ఈ రైలు పంపించేందుకు అవకాశం లేదన్నారు. పనులు పూర్తయ్యాక అహ్మదాబాద్ మీదుగా ఈ రైలును మళ్లిస్తామని లేదా మరో రైలును అహ్మదాబాద్‌కు నేరుగా నడుపుతామని వెల్లడించారు. కొత్త రైలు సేవలను సద్వినియోగం చేసుకోనాలని విజ్ఞప్తి చేశారు. 

రాజస్థాన్ ప్రజల కోరిక నెరవేర్చాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ మధ్య నేరుగా రైలు సదుపాయం కల్పించాలని  రాజస్థానీ యులు కోరడంతో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కరించామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.  హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌లో రైల్వే కోచ్‌లు, రైళ్లు, వ్యాగన్లు తయారీకి మా న్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

తెలంగాణలో అన్ని రైల్వేస్టేషన్లలో విద్యుదీకరణ, వైఫై సదుపా యం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. నాలుగో రైల్వే టర్మినల్ అయి న చర్లపల్లిని ప్రారంభించి నగరంలో రైల్వే ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ.720 కోట్లతో ఎయిర్‌పోర్ట్ తరహాలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రా వు, దక్షిణ మధ్యరైల్వే జీఎం శ్రీవాస్తవ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు,  అధికారులు పాల్గొన్నారు.

రీజినల్ రింగ్ రైల్‌తో ఇబ్బందులు తీరుతయ్

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించేందుకు శనివారం కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి ప్రత్యేక రైళ్లో ప్రయాణించారు. కంది ఐఐటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత వారు సమీపంలోని శంకర్‌పల్లి రైల్వేస్టేషన్ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక రైళ్లో కాజీపేటకు బయలుదేరారు. రీజినల్ రింగ్ రైల్ వల్ల హైదరా బాద్ నగరంలోకి గూడ్స్ రైళ్లు రాకుండా బయటి నుంచే వెళ్లేందుకు అవకాశం లభిం చి రైళ్ల రాకపోకల ఇబ్బందులు తీరుతాయని అశ్వినీ వైష్ణవ్ దృష్టికి కిషన్‌రెడ్డి తీసుకుపోయారు. 

మనోహరాబాద్ కొత్తపల్లి లైన్‌కు నిధులు భారీగా కేటాయించి త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఇదేమార్గంలో ఉన్న కొమురవెల్లి మల్లన్న ఆలయానికి  వేలాది మంది భక్తులు వస్తుండడంతో అక్కడ కొత్త రైల్వేస్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే జనవరిలో కొమురవెల్లి స్టేషన్‌ను పూర్తిచేసి మల్లన్నస్వామికి అంకితం చేస్తామన్నారు. యాదగిరిగుట్ట వరకు రూ. 330 కోట్లతో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేసి భక్తులకు  అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల ఆధునికీకరణ త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని రైల్వే మంత్రిని కోరగా.. వెంటనే పనుల పురోగతి పెంచాలని రైల్వే జీఎం శ్రీవాస్తవను అశ్వినీ వైష్ణవ్ ఆదేశించారు.