calender_icon.png 19 July, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవ అనుగ్రహం అందరిపై ఉండాలి

19-07-2025 05:59:39 PM

- ప్రతి ఒక్కరూ సన్మార్గంలో ప్రయాణించాలి

- మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): దైవ అనుగ్రహం అందరిపై ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahbubnagar MLA Yennam Srinivas Reddy) అన్నారు. శ్రీశ్రీశ్రీ సద్గురు చంద్రమౌళీశ్వర పురుషోత్తమానంద సరస్వతి స్వామి వారి 115వ ఆరాధన మహోత్సవాలు మహబూబ్ నగర్ మండలంలోని కోటకదిర గ్రామంలో వైభవంగా నిర్వహించారు. శ్రీ సద్గురు చంద్రమౌళీశ్వర పురుషోత్తమానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహం అందరిపైనా ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సద్గురువు చూపిన మార్గంలో పయనిద్దామని సూచించారు. రూ.20 లక్షల ముడా నిధులతో నిర్మించనున్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయంలో షెడ్ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి,డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, నాయకులు సిజె బెనహర్, సుధాకర్ రెడ్డి, కె. రామచంద్రయ్య, మల్లు అనిల్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, మహేందర్ గౌడ్, కె. సాయిలు, కురుమూర్తి, వెంకటేష్, కైసర్, మనెమ్మ, మైబు, లాలు, పోతన్ పల్లి మోహన్ రెడ్డి , వెంకట్ రాములు , శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.