calender_icon.png 20 July, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏజెన్సీలో వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి

19-07-2025 10:26:23 PM

ఐటిడిఏ పిఓ రాహుల్..

భద్రాచలం (విజయక్రాంతి): ఏజెన్సీ ఏరియాలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రులలో పనిచేయుచున్న వైద్యాధికారులు, సిబ్బంది కార్యక్రమాల నిర్వహణ పనితీరు  చాలా బాగుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శనివారం సాయంత్రం తన ఛాంబర్ లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ఏజెన్సీ ఏరియాలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడపబడుతున్న సిహెచ్సి ల పనితీరుపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం, పాల్వంచ, చర్ల, మణుగూరు, ఇల్లందు, బూర్గంపాడు, అశ్వరావుపేట సిహెచ్ సి లలో అన్ని రకాల వైద్య పరీక్షలకు డాక్టర్ల నియామకం జరిగిందని అందులో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది పనితీరు చాలా బాగుందని, ఏజెన్సీ ఏరియాలో అన్ని రోగాలకు సంబంధించిన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షలు చేయడం వలన చాలావరకు గ్రామాలలో వ్యాధుల తీవ్రత తక్కువగా ఉందని అన్నారు.

పీహెచ్సీలలో  సిహెచ్ సి లలో డయాలసిస్ ట్రీట్మెంట్ తో పాటు నార్మల్ డెలివరీలు అయ్యేలా చూడాలని, ప్రతిరోజు ఓపికి సంబంధించిన పేషెంట్ల వివరాలు తప్పనిసరిగా రికార్డులలో పొందుపరచాలని అన్నారు. ఈ మూడు నెలలు మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మరింత జాగ్రత్తలు వహించాలని, అలాగే వరదల వలన ముంపునకు గురి అయ్యే గ్రామాలకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అందుకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చూడాలని వైద్యాధి కారులకు సూచించారు. త్వరలో చర్ల సిహెచ్ లో కొత్తగా ఆపరేషన్ థియేటర్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని తప్పకుండా రావాలని డి సి హెచ్ ఎస్ రవిబాబు పిఓను కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ రామకృష్ణ, ఆర్ ఎం ఓ సంతోష్, నర్సింగ్ పర్యవేక్షకురాలు యశోదా రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.