calender_icon.png 3 December, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తజన సంద్రంగా మినీ మేడారం

13-02-2025 12:00:00 AM

ఘనంగా సమ్మక, సారక్క జాతర ప్రారంభం 

రాజేంద్రనగర్ (విజయక్రాంతి) ఫిబ్రవరి 12 : మినీ మేడారం భక్తజన సందర్భంగా మారింది. సమ్మక్క, సారక్క జాతర ఘనంగా ప్రారంభమైంది. రాజేంద్రనగర్ లోని మనసా హిల్స్ గుట్టలపై వెలసిన సమ్మక్క, సారక్కను స్థానికులు మినీ మేడారం గా వ్యవహరిస్తుంటారు. మేడారం జాతర మాదిరిగానే ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

సమ్మక-సారక్క ఆలయ నిర్వాహకుడు చంద్రకుమార్ ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవార్లను డప్పు మేళాలతో శివసత్తుల  పూనకాల మధ్య అమ్మవార్లను గద్దెపైకి తీసుకువచ్చి కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ ప్రాంతం తో పాటు రంగారెడ్డి జిల్లా వివిధ ప్రాంతాల నుంచి జనం వేలాదిగా తరలివచ్చారు.

అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో కొలిచి కిలోల కొద్దీ బంగారాన్ని సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నాయకులు సురేష్ గౌడ్, నాగరాజు, గరిడయ్య ముదిరాజ్, రాముడు యాదవ్, పచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.