calender_icon.png 20 July, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి అంబటి రాంబాబు సోదరి విజయలక్ష్మి దంపతులు

20-07-2025 05:10:40 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): మంత్రి అంబటి రాంబాబు సోదరి శ్రీమతి విజయలక్ష్మి తన భర్త విజయ్‌కుమార్, కుమారులుతో కలిసి హైదరాబాద్‌ బోనాల సందర్భంగా బాల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని(Balkampet Yellamma Temple) దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో తల్లికి బోనం సమర్పించి, కుటుంబ సమేతంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని తల్లిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. 

దేవస్థానం పాలకమండలి సభ్యులు సి. సత్యనారాయణ, శ్రీమతి సి. సుధా విజయలక్ష్మి కుటుంబానికి ఘనస్వాగతం పలికారు. శేషవస్త్రాలు, ప్రసాదం అందజేసి, వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగలో భాగంగా తల్లికి బోనం సమర్పించటం ఎంతో పవిత్రమైన అనుభూతి. మా కుటుంబ సభ్యుల సుఖశాంతులకోసం, ప్రజల ఆరోగ్యకాంక్షతో తల్లిని ప్రార్థించాం. అలయ అభివృద్ధికి ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తాం అని పేర్కొన్నారు.