calender_icon.png 20 July, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులపై మంత్రి సీతక్క సమావేశం

19-07-2025 07:56:27 PM

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులపై రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Danasari Seethakka) సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్, కమిషనర్ వెంకట్రావు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా, గిరిజన సాంస్కృతిక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆలయ పూజారులు, నిపుణులు పూజారుల కోరిక మేరకు భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం ఆదివాసీ గిరిజన సంస్కృతి, సమ్మక్క సారలమ్మల తెగువ ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయం అమ్మల గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ఆలయ పరిసరాల్లో ఆధునీకరణ పనులు పూజారుల విశ్రాంతి గదులు, అత్యవసర సేవలు, భద్రత, వైద్య సిబ్బంది, మీడియా కోసం అదనపు వసతులు కల్పించేలా ప్రతిపాదనలు చేశారు.