calender_icon.png 21 July, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో మంత్రుల ఆదేశాలు అమలు కావడం లేదు

19-07-2025 08:10:05 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి  జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ గురుకులాల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ ల ఆదేశాలు అమలు కావడం లేదని తెలంగాణ గురుకులాల విద్యార్థుల హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మొగురం రమేష్ అన్నారు. ఎందుకంటే వారు వర్షాకాలం మూలంగా విద్యార్థులకు ఎక్కువగా దోమల బెడద ఉన్నందున వెంటనే ఆయా గురుకులాల ప్రిన్సిపాల్స్ కిటికీలు, అలాగే జాలీలు, దోమతెరలు ఏర్పాటు చేయాలని మంత్రులు చెప్పినప్పటికీ అవి కింది స్థాయిలో ఉన్న గురుకులాల ప్రిన్సిపాల్స్ అమలు చేయడం లేదన్నారు.

దీంతో విద్యార్థులకు విష జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తున్నందున గురుకుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర మంత్రుల ఆదేశాలు కరీంనగర్ ఉమ్మడి  జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు ఆ సమస్యల ను పరిష్కరించేలా చూడాలన్నారు. అవసరమైతే జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు తనిఖీలు చేస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పై స్థాయిలో చెప్పే విషయాలన్నీ కింది స్థాయిలో అమలు కావడం లేదన్నారు. గురుకులాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నప్పటికీ కొంతమంది ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.