calender_icon.png 21 July, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదృశ్యమైన యువకుడు శవమై తేలాడు

20-07-2025 09:55:04 PM

మేడ్చల్ అర్బన్: స్నేహితులతో కలిసి బోనాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన యువకుడు మేడ్చల్ పెద్ద చెరువులో శవమై తేలిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్(Medchal Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల.. ప్రకారం పీర్జాదిగూడ మున్సిపాలిటీకి చెందిన శ్రీనివాస్, సుధ దంపతులకు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు జంగిడి రామ్ చరణ్(17) ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసి కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.

ఇద్దరు కుమారులను ఇంట్లో వదిలి ఈనెల 17న భార్యాభర్తలిద్దరూ పనిమీద బయటకు వెళ్లారు. చిన్న కుమారుడు తన స్నేహితులతో మేడ్చల్ బోనాలకు వెళ్తున్నానని, అన్నతో చెప్పి ఇంటి నుండి వెళ్ళాడు. అదే రోజు రాత్రి మద్యం మత్తులో ప్రమాదవశాత్తు మేడ్చల్ పెద్ద చెరువులో పడిపోయినట్లు సమాచారం. బోనాల ఉత్సవాలకు వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవడంతో తండ్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా మేడ్చల్ పెద్ద చెరువులో ఆదివారం జంగిడి రామ్ చరణ్ మృతదేహం లభ్యం కావడంతో మేడ్చల్ పోలీసులు ఇట్టి విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.