19-07-2025 06:19:17 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): బిచ్కుంద మండలం ఎల్లారం తాండలో నిర్మించిన నూతన అంగన్‌వాడీ కేంద్రాన్ని శనివారం రోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Lakshmi Kanta Rao) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్‌వాడీల సేవలను ఆయన అభినందించారు. అంగన్వాడీల బలోపేతం, ఆధునీకరణ దిశగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.