19-07-2025 03:03:54 PM
మేడ్చల్ అర్బన్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడకంలో మన దేశం ముందుండేలా విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేయాలని మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి అన్నారు. సోమవారం కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఏఐ భారత్ ఉత్సవ్ 2025 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశిస్తూ మల్లారెడ్డి మాట్లాడారు. ప్రపంచంలోని పలు దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడకంలో ముందున్నాయని, భారతదేశంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగిస్తూ ఆధునికంగా విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు.
రాబోయే రోజుల్లో విద్యార్థులు కాలయాపన చేయకుండా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగిస్తూ ముందుకు రాణించాలని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ అద్భుతమని ఎమ్మెల్యే, విద్యార్థులు తమ చిన్న వయసులోనే లక్ష్యాలను సాధించుకునే విధంగా నిత్యం అడుగులు వేయాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి విద్యార్థులను ప్రేరేపించారు. కార్యక్రమంలో కళాశాలల ఛైర్మన్ చేమకూర గోపాల్ రెడ్డి, మేనేజ్మెంట్ సభ్యుడు శ్రీశైలం రెడ్డి, సీఈఓ అభినవ్ రెడ్డి, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.