19-07-2025 10:15:51 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) శనివారం హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు బయ్యారం సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, గార్ల సింగిల్ విండో చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి భూక్యా ప్రవీణ్ నాయక్, కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.