19-07-2025 02:32:48 PM
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
నిజాంసాగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం-2025 కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం జగన్నాథపల్లి గ్రామంలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్థానిక నాయకులు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సూచించారు.