21-07-2025 12:00:00 AM
పెద్దపల్లి, జూలై 20(విజయ క్రాంతి) పెద్దపల్లి పట్టణంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల మైదానం లో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ప్రతీ ఏటా ఏర్పాటు చేసే భారీ మట్టి గణపతి ప్రతిష్టాపనలో భాగంగా ఆ దివారం ఛత్రపతి యువసేన సభ్యు లు, స్థానిక నాయకులతో కలిసి గణనాథుని మండపం కర్ర పూజ మహోత్సవంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఛత్రపతి యువసేన సభ్యులు ఎమ్మెల్యే ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఛత్రపతి యువసేన సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, పట్టణ వ్యాపారులు, కాంగ్రెస్ అనాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.