calender_icon.png 19 July, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల మదిలో నిలిచిపోయేలా పనులు చేయండి

19-07-2025 02:59:53 PM

నాణ్యత ప్రమాణాలు పాటించి సిసి రోడ్లు నిర్మించండి 

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా పనులు చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని భూలక్ష్మి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ పనులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు కలిగి రోడ్ పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యే  ఆదేశించారు. నాణ్యత ప్రమాణాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా పనులు చేయాలని తెలిపారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా నిబంధనలు అమలు చేస్తూ పనులు చేయాలని సూచించారు.