calender_icon.png 21 July, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో.. ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

21-07-2025 12:53:57 AM

కామారెడ్డి, జూలై 20 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాలో ఘనంగా బోనాల ఉత్సవాలను జిల్లా ప్రజలు జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్రేడ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మైసమ్మ ఆలయానికి బోనాలను తీసుకువచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. వాంబే కాలనీవాసులు మైసమ్మ కు బోనాలు సమర్పించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ, పంచముఖ హనుమాన్ కాలనీలోని సోమన్న గారి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాలు తీసి మైసమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద పట్టణాల్లో ఘనంగా బోనాల వేడుకలను జరుపుకున్నారు. మహిళలు బోనాలను పూజించి అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు, బాన్సు వాడ లో  పోచారం శ్రీనివాస్ రెడ్డి లు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలను జిల్లా ప్రజలు జరుపుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.