20-07-2025 12:26:42 PM
ఉమ్మడి జిల్లాకు కేంద్రం రూ.100 కోట్ల సాయం ప్రకటించడంపై ఎంపీ డీకే అరుణ హర్షం
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాకు కేంద్రం రూ.100 కోట్ల సాయం ప్రకటించడం పట్ల మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాలపై ఇటీవల కేంద్ర ప్రత్యేక సర్వే చేయడం జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా 12 జిల్లాల కు తెలంగాణలో 3 జిల్లాల గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోనే తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న జిల్లాలుగా మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్ నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ మూడు జిల్లాలకు కలిపి 15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు జాతీయ విపత్తు నిర్వహణ కింద రూ. 100 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రూ.100 కోట్లతో ఈ మూడు జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తి, పర్యావరణ మద్దతు, రైతుల ఆదాయ భద్రత కు వినియోగపడతాయని తెలిపారు. ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లా ప్రజలు, రైతులందరి తరపున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ డీకే.అరుణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.