calender_icon.png 20 July, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ రఘునందన్‌ను మరోసారి బెదిరింపు

20-07-2025 12:47:14 AM

మావోయిస్టుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తి కాల్

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. మావో యిస్టుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తి శనివారం ఎంపీ రఘునందన్‌కు ఫోన్ చేసి అంతుచూస్తామని హెచ్చరించారు. తనకు వచ్చిన ఫోన్ కాల్ నెంబర్‌ను ఆయన మీడియాకు వెల్లడించారు. రఘునందన్‌కు గతంలోనూ రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గత నెలలో ఫోన్ చేసిన దుండగులు ఆపరేషన్ కగార్ ఆపాలంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. డీజీపీ, మెదక్, సంగారెడ్డి ఎస్పీలతో పాటు సిద్దిపేట సీపీకి ఎంపీ ఫిర్యాదు చేశారు.