20-07-2025 06:36:15 PM
రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్, బక్రీద్, మొహర్రం, పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు(Former DCMS Chairman Kotwala Srinivasa Rao) అన్నారు. పాత పాల్వంచలో గత పది రోజులుగా నిర్వహించిన ముస్లింల పండుగ కౌడిపీరీల మహోత్సవం ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని ప్రతి ఒక్కరూ పరోపకారంతో తోటి వారికి సహాయపడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న,కౌడిపీరీల ఉత్సవాల నిర్వాహకులు బాబుమీయ, అజ్మత్ అలీ, యాకుబ్ అలీ, గుమ్ష వలి, జాకీర్, హఫీజ్, రహమత్ అలీ, యాసిన్ పాషా, మౌలాలి, పిల్లల ఆదినారాయణ, యాదయ్య, జానీ, ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.