బీజేపీలోకి అరిగెల నాగేశ్వర్‌రావు
కిషన్ రెడ్డి సమక్షంలో చేరిక
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్17 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్‌రావు కారు దిగి కమలం గూటికి చేరారు. ఆయనతోపాటు ఆసిఫాబాద్ ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, పలువరు బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఇప్పటికే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, సిర్పూర్ నియోజవర్గంలోని పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, ఆసిఫాబాద్ నియోజవర్గంలోని రెబ్బెన జడ్పీటీసీ సంతోష్, వాంకిడి ఎంపీపీ విమల, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాదవెణి మల్లేశ్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.






