19-07-2025 09:04:28 PM
మెదక్ ఎంపీ రఘునందన్ రావు..
దౌల్తాబాద్: బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కుమ్మరి నర్సింలు మృతి బిజెపి పార్టీకి తీరని లోటు అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) పేర్కొన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి(జీర్కపల్లి) నర్సింలు గుండెపోటుతో మృతి చెందాడు. శనివారం విషయం తెలుసుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు అంతిమయాత్రలో పాల్గొని తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నర్సింలు మృతి పట్ల వివిధ పార్టీలకు చెందిన నాయకులు అంతిమయాత్రలో పాల్గొని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు గిరీష్ రెడ్డి, తోట కమలాకర్ రెడ్డి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల బిజెపి పార్టీ అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి, మంకిడి స్వామి,చింత సంతోష్ కుమార్, దుబ్బాక బాలేష్ గౌడ్, దౌల్తాబాద్ మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్నాల శ్రీనివాసరావు, భద్రయ్య, జర్నలిస్టులు శంభు లింగం నగేష్ ,సంతోష్, బాబు, యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.