calender_icon.png 21 July, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటే మాస్టర్ కొండపల్లి క్రాంతి కుమార్ కు జాతీయ స్థాయి అవార్డు

20-07-2025 08:39:37 PM

భానుచందర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న క్రాంతి కుమార్..

కరాటే కు మరింత వన్నె తేవాలి... సినీ నటుడు భానుచందర్..

అనంతగిరి: కరాటే విద్యకు మరింత వన్నె తేవాలని సినీ నటుడు కరాటే కింగ్ భానుచందర్(Film Actor Bhanuchander) అన్నారు. ఆదివారం విజయవాడలో వైఎంకె అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే మాస్టర్స్ ఎంపిక పోటీల్లో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ క్రాంతి కుమార్ కు జాతీయస్థాయి మాస్టర్ అవార్డును అందజేశారు. కరాటే క్రీడను మరింత అభివృద్ధి చేయాలని కోరారు.

కాగా తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా కర్ణాటక నాలుగు రాష్ట్రాల నుండి  400 మంది మాస్టర్లు పాల్గొన్నట్లు క్రాంతి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ... కోదాడ ప్రాంతంలో కరాటే అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. క్రాంతి కుమార్ కు జాతీయస్థాయి అవార్డు వరించడం పట్ల పలువురు కరాటే మాస్టర్లు విద్యార్థులు పాఠశాలల కరస్పాండెంట్లు అభినందించారు.