calender_icon.png 21 July, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోరింటాకు ప్రకృతి వైద్యం

20-07-2025 11:21:32 PM

హుజూర్‌నగర్: గోరింటాకు ప్రకృతి వైద్యమని ఆషాడ మాస గోరింటాకు ఉత్సవాల నిర్వాహకులు నూకల నిర్మల వీరేవల్లి పద్మావతి అన్నారు. ఆదివారం పట్టణంలో మహిళలు ఆషాఢమాసం గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గోరింటాకు ప్రాముఖ్యత, ప్రకృతి వైద్యంలా గోరింటాకు పని చేస్తుందని, అనాది కాలం నుండి మన సంస్కృతిలో గోరింటాకు పెట్టుకోవడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నూకల నిర్మల, వీరేవల్లి పద్మావతి, కనమర్లపూడి శ్రీదేవి, గాయత్రి నాగలక్ష్మి, ఉప్పల కుమారి, ఉప్పల శివకుమారి, మోహిని, చిన్న శ్రీదేవి, గోళ్ళమల్లిక, కాళంగి లత, చేపూరి కళ్యాణి, ఝాన్సీ రాధా, శిరీష పాల్గొన్నారు.