19-07-2025 05:47:22 PM
రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య..
ఇల్లందు రూరల్ (విజయక్రాంతి): ఇల్లందు ఎమ్మెల్యే(MLA Koram Kanakaiah) ఆదేశానుసారం వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి కొమరారం గ్రామంలో శుక్రవారం మార్కెట్ కమిటీ భానోత్ రాంబాబు ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఫ్రారంభించారు. ఇల్లందు మార్కెట్ లో రైతుల రధ్ధి దృష్ట్యా నూతన విక్రయ కేంద్రాలకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఇల్లందు ప్రాంత రైతులకు సరిపడే యురియా అందుబాటులో ఉందనీ రైతులు ఆధైర్ పడాల్సిన పని లేదన్నారు. కొమరారం, మర్రిగూడెం, పొలారం, పొచారం, బోయితండా, మాణిక్యారం, మామిడి గూడెం గ్రామ రైతులకు యురియా విక్రయ కేంద్రం ద్వారా యూరియాను వ్యవసాశాఖ అధికారులు విక్రయించనున్నారు. రాజకీయంగా కనుమరుగు అయ్యే బిఆర్ఎస్ పార్టీ వారి మాటలు నమ్మి రైతులు మోసపోవద్దన్నారు.
రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, రైతులను పావుల్లా వాడుకుందాం అని చుస్తున్నారు. మీ పాలనలో రైతుల గురించి పట్టించుకోకపోవడం వల్లనే ఓటమికి ప్రధాన కారణం అని గుర్తుంచుకోవాలన్నారు. ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య రైతులకు ఇచ్చిన మాట నిరవేరుస్తూ నేడు కొమరారం గ్రామంలో రైతుల సౌకర్యార్ధం ఎరువుల విక్రయ కేంద్రాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సొసైటి చైర్మెన్ మెట్ల క్రిష్ణ, డైరెక్టర్లు కిన్నెర నర్సయ్య, రమేష్,నిర్మల,బండారి వెంకన్న,ఆత్మ కమిటి డైరెక్టర్స్,పుప్పాల ఉపేందర్,మచ్చా రమేష్, డి సి సి డైరెక్టర్ జగం కోటయ్య,నాయకులు చెన్నూరి క్రిష్ణ,చెన్నూరి శ్రీను,ధారవత్ చంద్ర శేఖర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఏ డి లాల్ చంద్, ఏ ఓ సతీష్, తదితరులు పాల్గోన్నారు.