calender_icon.png 20 July, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగస్టు 7న గోవాలో ఓబీసీ మహాసభ

20-07-2025 12:59:16 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 19 (విజయక్రాంతి): ఆగస్టు 7న గోవాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభను పెద్ద ఎత్తున  నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శనివారం ప్రకటనలో వెల్లడించారు.

దేశంలో మొదటిసారి మండల్ కమిషన్ సిఫార్సులైనా ఓబీసీలకు ఉద్యోగ రంగంలో 27శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు మాజీ ప్రధాని వీపీ సింగ్ ప్రకటించిన ఆగస్టు 7న ఏటా దేశంలోని అన్ని బీసీ ఉద్యమ శక్తులను వ్యక్తులను కలుపుకొని జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలి పారు.

పదవసారి జరిగే జాతీయ మహా సభకు దేశంలోని 29 రాష్ట్రాల నుంచి పది వేల మంది ఓబీసీ ప్రతినిధులు హాజర వుతున్నారని, దేశంలోని  అఖిలపక్ష నేతల ను, ఓబిసి జాతీయ నాయకులను ఆహ్వానిం చినట్లు జాజుల తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాసభలో జాతీయ స్థాయిలో ఓబీసీలు ఎదుర్కొంటున్న డిమాం డ్లపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు జాజుల తెలిపారు.