calender_icon.png 20 July, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాలు, హాస్టల్లో అధికారుల తనిఖీలు

19-07-2025 07:46:24 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, హాస్టల్లో మండల ప్రత్యేక అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయంపై ఆరా తీశారు. అలాగే వసతి గృహాలను, డైనింగ్ హాల్, టాయిలెట్స్, కిచెన్ షెడ్, స్టడీ రూమ్, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన కామన్ మెనూ ప్రకారం భోజనం అందజేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చూపకూడదని సూచించారు.