calender_icon.png 20 July, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు స్వయం సమృద్ధికి మార్గం: ఏడిఏ సునీత

19-07-2025 08:27:10 PM

హుజూరాబాద్ (విజయక్రాంతి): ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకి స్వయం సమృద్ధికి మార్గం ఏర్పడుతుందని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏ.డి.ఏ) సునీత(ADA Sunitha) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో ఆయిల్ ఫామ్ తోటలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, నీటి కొరత, మార్కెట్ అస్థిరతల నేపథ్యంలో రైతులకు ఆయిల్ పామ్ సాగు కొత్త దారి చూపుతుందన్నారు. హుజూరాబాద్ డివిజన్‌లో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, పొగాకు, మిర్చి పంటలపై ఆధారపడుతున్నారని, మార్కెట్ వీటికి మద్దతు ధర లేని పరిస్థితులు ఏర్పడే అన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు రైతులను ఆర్థికంగా నష్టాల్లోకి నెట్టేశాయని సూచించారు. ఈ సమయంలో ఆయిల్ పామ్ వంటి దీర్ఘకాలిక లాభదాయక పంటల సాగు రైతులకు స్థిర ఆదాయాన్ని అందిస్తుందని రైతులకు సూచించారు.

రైతు-సబ్సిడీలు ప్రతి మొక్క ధర రూ.193 కాగా, కేవలం రూ.20 రూపాయలకే ప్రభుత్వం రైతులకు అందిస్తుందన్నారు. మిగిలిన మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. పైగా నాలుగు సంవత్సరాల పాటు ఎకరాకు రూ.4200 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ధరల గందరగోళం లేకుండా నేరుగా కొనుగోలు పంటను ఆయిల్ పామ్ కంపెనీలు నేరుగా రైతుల వద్ద నుంచి సేకరించి, 15 రోజుల్లో డబ్బులు రైతు ఖాతాలోకి జమ సాయి అన్నారు.నెలవారీగా ప్రభుత్వమే ధరలు నిర్ణయించడంతో పారదర్శకతతో పాటు భద్రత లభిస్తుంది. ఇతర పంటలతో అంతర ఆదాయం మొదటి మూడు సంవత్సరాల్లో తక్కువకాల అంతర పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. ఆరవ ఏడాది తర్వాత కోకో, వక్క, జాజికాయ, పొద మిరియాలు వంటి వాణిజ్య పంటలు వేసుకోవచ్చు. పరిశీలనలో ఉన్నటువంటి టెక్నికల్ సపోర్ట్ ప్రతి క్లస్టర్‌కు కేటాయించిన అధికారుల ద్వారా సాంకేతిక మార్గదర్శనం, ట్రైనింగ్ లభిస్తుందన్నారు.

డ్రిప్ ఇరిగేషన్‌పై ఎస్సీ, ఎస్టీ రైతులకు 100%, బీసీ రైతులకు 90%, ఇతరులకు 80% సబ్సిడీతో 12.5 ఎకరాల వరకు మద్దతు లభిస్తుందని రైతులకు తెలిపారు. తక్కువ ఇన్వెస్ట్ – ఎక్కువ లాభం ఆయిల్ పామ్ పంటకు తెగుళ్లు, చీడపీడల బెడద తక్కువ. దీర్ఘకాలికంగా లాభదాయకమైన పంట 4వ సంవత్సరం: 3-4 టన్నులు 5వ సంవత్సరం: 5-6 టన్నులు 6వ సంవత్సరం: 10-12 టన్నులు తన్ను ధర రూ.15,000గా లెక్కిస్తే, ఒక్క ఎకరా నుంచి ఏడాదికి రూ.1,00,000 వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. ఆయిల్ పామ్ సాగు 30–35 ఏళ్లు వరకూ దిగుబడి ఇస్తుంది. అంతర పంటల ద్వారా అదనంగా ఎకరాకు రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులకు సూచించారు. ఆసక్తిగల రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని ఆమె రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు భూమి రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ బి. మంజువాణి, ఏ.ఇ.ఓ నిఖిల్, ఫీల్డ్ ఆఫీసర్ వేణుతో పాటు తదితరులు పాల్గొన్నారు.