calender_icon.png 2 December, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చక్ర వాహనం బోల్తా.. ఒకరికి తీవ్రగాయాలు

12-02-2025 10:16:01 PM

మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని అడవి నాగపల్లికి చెందిన జిల్లెల్ల రాజబాబు (38) పని నిమిత్తం గ్రామం నుండి మంథని వైపు వస్తుండగా బట్టుపల్లికి సమీపంలో అకస్మాత్తుగా ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో ఎడమ చేయి విరిగి నుజ్జునుజు అయింది. అక్కడక్కడ స్వల్ప గాయాలు కాగా, స్థానికులు గమనించి 108 కి సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని విరిగిన చేయికి ప్రింట్ అప్లై చేసి నొప్పికి నివారణ ఇంజక్షన్ ఇచ్చి గాయపడిన చోట ప్రాథమిక చికిత్స చేస్తూ గోదావరిఖని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి సిబ్బంది తరలించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది ఈఎంటి నిమ్మతి శ్రీనివాస్ పైలట్ హబీబ్ లను వైద్యులు అభినందించారు. కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు.