calender_icon.png 20 July, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్ల కల నెరవేరింది

19-07-2025 10:14:03 PM

అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే..

ములకలపల్లి (విజయక్రాంతి): గత పదేళ్ల నుంచి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల కలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెరవేర్చిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ(MLA Jare Adinarayana) పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసిన తెల్ల రంగు రేషన్ కార్డులను శనివారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పంపిణీ చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో అర్హులైన ప్రతిలబ్ధిదారునికి రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల ఎంతగా కట్టుబడి ఉందో మళ్లీ ఒకసారి చాటి చెప్పిందన్నారు.

ఇంత కాలంగా రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న అనేక మంది పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరగడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో మరిన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని  ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, నాయకులు పర్వతనేని అమర్నాథ్,కరటూరి కృష్ణ,పువ్వాల మంగపతి.కారం సుధీర్,గాడి తిరుపతిరెడ్డి,సురభి రాజేష్, శనగపాటిరవి, పాలకుర్తి సుమిత్, భూక్య  పత్తిలాల్, మీడియం బుల్లబ్బాయి, పాలకుర్తి రవి ,పరిషక ప్రసాద్, సోయంనాగరాజు,తాసిల్దార్ గన్యా, ఎంపీడీవో సత్యనారాయణ, ఏవో అరుణ్ బాబు,ఆర్ఐలు బద్రు సత్యవతి,మండలనాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.