calender_icon.png 20 July, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నూరు కాపు కులస్తుల సంక్షేమానికి కృషి

20-07-2025 02:34:07 PM

మందమర్రి,(విజయక్రాంతి): సమాజంలోని మున్నూరు కాపు కులస్తుల సంక్షేమానికి వారి అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని మున్నూరు కాపు సంఘం పొన్నారం  గ్రామ కమిటీ అధ్యక్షులు పెంచాల ముత్తయ్య పటేల్ అన్నారు. మండలంలోని పొన్నారం  గ్రామంలో ఆదివారం నిర్వహించిన మున్నూరు కాపు కులస్తుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కులస్తులు ఐక్యంగా ఉండి సంఘం అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ప్రభుత్వ పరంగా అందించే సంక్షేమ కార్యక్రమాలు కులస్తులకు అందించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు అనంతరం గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను కులస్తులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కులస్తులు పాల్గొన్నారు.

అధ్యక్షులుగా పెంచాల ముత్తయ్య...

పొన్నారం గ్రామం మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ అధ్యక్షునిగా గ్రామానికి చెందిన పెంచాల ముత్తయ్య పటేల్ ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా బర్ల కృష్ణస్వామి, సలహాదారులుగా  నలెల్లి సత్తయ్య, కోశాధికారిగా నలెల్లి వినీత్, కమిటీ సభ్యులుగా  బండారి బాపు, ముప్పిడి లచ్చయ్య, తోట చంద్రయ్య, కొంతం బాపు, పూసాల రవి, పెంచాల రాజలింగు, పెంచాల రంజిత్, ముప్పిడి సంపత్ లు  ఎన్నికయ్యారు.