20-07-2025 01:08:34 AM
ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి ఎమ్మెల్సీ కొమురయ్య లేఖ
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): మోడల్ స్కూళ్లలో పనిచేసే సిబ్బందికి ఐదు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలనిప్రభు త్వాన్ని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కోరారు. ఈమేరకు శనివారం ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి ఆయన లేఖ రాశారు.
మోడల్ స్కూల్ సిబ్బందికి 010 విధానంలో ప్రతినెలా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఐదు నెలలుగా వేతనాలు లేక ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వెంట నే వారికి వేతనాలు చెల్లించాలని లేఖలో ఆయన కోరారు.