19-07-2025 11:46:03 PM
మెరుగైన వైద్య సేవలు అందించాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదేశం..
జడ్చర్ల: జడ్చర్ల నుంచి కోడుగల్ గ్రామానికి విద్యార్థులతో వెళుతున్న ఆటో గంగాపురం గ్రామం సమీపంలో బోల్తాపడిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిరోజు మాదిరిగానే జడ్చర్లలో చదువుకుని సాయంత్రం సమయంలో పోడుగల్ గ్రామానికి ప్యాసింజర్ ఆటోలో విద్యార్థులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో జడ్చర్ల నుంచి శనివారం సాయంత్రం కోడుగల్ గ్రామానికి ప్యాసింజర్ ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో గంగపురం గ్రామ సమీపంలో ఒక్కసారిగా ఆటో బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది. హుటాహుటిన విద్యార్థులను 108 ద్వారా జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) వెంటనే ఆస్పత్రికి చేరుకొని క్షతగాత్రులను, ఆటో బోల్తా పడడానికి గల కారణాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు పెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించారు. దాదాపుగా 15 మందితో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ఆటోలో 13 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. ఊరిలో కొంతమంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలయాన్ని డాక్టర్లు చెబుతున్నారు. విద్యార్థులతో ప్రయాణాలు జరిపి ఆటోలు మరింత జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించే అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు. మరింత సమాచారం తెలియవలసి ఉంది.