calender_icon.png 20 July, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ పౌరులుగా ఎదిగి, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి

19-07-2025 07:56:52 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదిగి తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలని ఖమ్మం జిల్లా ఐసిఐ సింధూర్ ప్రెసిడెంట్ ఇంపాక్ట్ సర్టిఫైడ్  ట్రైనర్ తేజావత్ ధనలక్ష్మి విద్యార్థులకు సూచించారు. స్థానిక ఎస్ జే కే యం కళాశాల నందు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలను గురించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ఉండాలని ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండాలని చెడు అలవాటును విడనాడి మంచి అలవాట్లను నేర్చుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి సమాజం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు విద్యార్థులు తాము ఎంత ఎత్తు ఎదిగిన తల్లిదండ్రులను గౌరవించడం మర్చిపోవద్దని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి మన చరిత్రను మన సంస్కృతిని గౌరవించడం మరిచిపోవద్దని తెలిపారు.