20-07-2025 12:48:25 AM
పవర్‌ఫుల్ పాలిటిక్స్ నడిచే తెలంగాణలో ప్రస్తుతం ‘పవర్ పాయింట్’ పాలిటిక్స్ ట్రెండ్ కొనసాగుతుంది. ఏదైనా అంశంపై లీడర్లకు గాని, ప్రజలకు గాని అవగాహన కల్పిం చేందుకు బడా నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఎంచుకుంటున్నారు. గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాం ప్రదాయం కార్పొరేట్ కంపెనీల ఉన్నత స్థాయి సమావేశాల్లోనే ఉండేది.
పలు కంపెనీలు తమ ఉద్యోగులకు లేదా సిబ్బంది ఓ ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేసి చెప్పదలచిన అంశాలను కంప్యూటర్‌లో రూపొందించిన స్లుడ్స్‌ల వారీగా ప్రదర్శించేవారు. ఈ పీపీటీల ప్రదర్శన ఇటీవల తెలంగాణ పాలిటిక్స్‌లోనూ భాగమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు మీద అటు అధికార కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి హరీశ్‌రావు పలుమార్లు ఈ పీపీటీల ప్రదర్శన చేశారు. బనకచర్ల మీద కూడా పీపీటీల షో నడుస్తోంది. దీంతో పవర్ పాలిటిక్స్ కాస్త పవర్ పాయింట్ పాలిటిక్స్ అయ్యాయని పలువురు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.
తమ్మనబోయిన వాసు