కమాన్‌ల పునరుద్ధరణకు ప్రతిపాదనలు
హెరిటేజ్ వాక్‌లో కమిషనర్ రోనాల్డ్ రోస్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (విజయక్రాంతి) : హైదరాబాద్ మహా నగరంలో చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించుకోవడానికి మోజంజాహి మార్కె ట్, మౌలాలి కామన్, క్లాక్ టవర్ భవనాలను రూ. 18.33 కోట్ల వ్యయంతో పునఃని ర్మాణం, సుందరీకరణ పనులు పూర్తి చేసినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. చార్మినార్ చుట్టూ ఉన్న ఆరు కమాన్లను పునఃనిర్మాణ పనులకు ప్రతిపాదనలు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రపంప వారసత్వ దినోతవ్సం పురస్కరించుకొని జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో దారుల్ షిఫా నుంచి ఉస్మానియా దవాఖాన వరకు గురువారం హెరిటేజ్ వాక్ జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలోని వారసత్వ సంపదను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ప్రత్యక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
అందులో భాగంగానే చార్మినార్ పెడెస్ట్రెయిన్ ప్రాజెక్టు అభివృద్ధి చేశామన్నారు. నగరంలోని ముర్గీ చౌక్, సర్ధార్ మహల్ పనులు కూడా చేపట్టి పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. రాణిగంజ్ కమాన్, షేక్ ఫెయిజ్ కమాన్, బజార్ కమాన్, దీవాన్ డేవడి కమాన్, దబీర్‌పూర్ కమాన్, హుస్సే న్ ఆలం కమాన్‌లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. 1908లో వచ్చిన మూసీ వరదల సందర్భంగా నగరంలో చేపట్టిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని ఈ వాక్‌ను నిర్వహించామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు కోట శ్రీవాత్సవ, చంద్ర కాంత్‌రెడ్డి, జోనల్ కమిషనర్లు రవికిరణ్, స్నేహ శబరిష్, అభిలాష అభినవ్ పంకజ, వెంకన్న, సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వాకిల్, చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు.






