20-07-2025 10:22:11 PM
మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రోగులకు మెరుగైన వైద్యం అందించి వారి మన్ననలు పొందాలని స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆదివారం ఆయన జిల్లా కేంద్ర గ్రంథాలయ చైర్మన్ హఫీస్ ఖాన్, ముస్లిం మత పెద్ద మౌలానా, ఏసానోద్దీన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, నిర్వాహకులు డాక్టర్ ముదిబీర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘం గౌరవ అధ్యక్షులు, హనుమంతరావు, డాక్టర్ ఏ ఏ ఖాన్, సదాత్ లి, జునేద్ హస్మి తదితరులు పాల్గొన్నారు.