calender_icon.png 2 December, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్ సి డబ్ల్యూ ఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కౌన్సిలింగ్...

12-02-2025 07:05:44 PM

ఏరియా సింగరేణి యాజమాన్యం..

కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియాలోని ఎన్ సి డబ్ల్యూ ఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కౌన్సిలింగ్ ను బుధవారం నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ కు 84 మంది ఉద్యోగులు దరఖాస్తులు చేసుకొగా, అర్హత, కేటగిరి, పదవిని బట్టి పూర్తి పారదర్శకతతో వారికి కౌన్సిలింగ్ ను నిర్వహించి, క్వార్టర్స్ ను కేటాయించటం జరిగింది. 84 దరఖాస్తులకు గాను 39 మంది వారి అర్హతకు తగిన క్వార్టర్స్ ను తీసుకోగా, 07 మంది కౌన్సిలింగ్ కి హాజరై క్వార్టర్స్ తీసుకోలేదు. 38 మంది కౌన్సిలింగ్ కు హాజరు కాలేదు. 

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ ఎస్ ఓ టు జిఎం ఎం. వెంకటేశ్వర రావు, ఏ.ఐ.టి.యు.సి బ్రాంచ్ సెక్రటరీ వి.మల్లికార్జున రావు, ఐ.ఎన్.టి.యు.సి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, డిజిఎం (పర్సనల్) బి. శివ కేశవరావు, ఇంచార్జ్ ఏరియా ఇంజనీర్ లక్ష్మణమూర్తి, ఇంచార్జ్ సివిల్ డిపార్ట్మెంట్ రాజారామ్, సీనియర్ పిఓ ఎం.మురళి, జి సంఘమిత్ర, ఆఫీస్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు తదితరులు పాల్గొనడం జరిగింది.