calender_icon.png 19 July, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డు సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతుంది

19-07-2025 06:16:29 PM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

బిచ్కుంద (విజయక్రాంతి): కొత్త రేషన్ కార్డు కేవలం నిత్యావసర సరుకుల మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలకు ఉపయోగపడతాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Lakshmi Kanta Rao) అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బిచ్కుందలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకాల అమలు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రజలకు ఇబ్బంది ఎదురుకాకుండా ఉండేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందని అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా గుడిసె కనబడకుండా ఉండాలని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.

ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేకుంటే మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. ప్రతి ఒక్కరికి గూడు కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు. సంక్షేమ పథకాలు విడతల వారీగా అందరికీ అందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద జుక్కల్ దొంగిలి మద్నూర్ పెద్ద కొడంగల్ పిట్లం నిజాంసాగర్ మహబూబ్నగర్ మండలాల లబ్ధిదారులు మొదటి విడత రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.