19-07-2025 06:27:01 PM
జేపీఎంసీ కళాశాలలో ఎంబీఏ విద్యార్థులకు వీడ్కోలు వేడుకలలో జేపీఎంసీ కళాశాల చైర్మన్ కె ఎస్ రవికుమార్..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ముందుకు అడుగులు వేయాలని జెపిఎన్సి కళాశాల చైర్మన్ కె ఎస్ రవికుమార్ అన్నారు. శనివారం జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ(Jaya Prakash Narayan College Of Engineering)లో ఎంబీఏ విభాగం విద్యార్థులకు వీడ్కోలు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఏఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పంతోనే జెపిఎన్సి కళాశాలను ఆవిష్కృతం చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ మహానగరాల్లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ వెనుకబడిన పాలమూరు జిల్లాను ఉన్నత శిఖరాలను చేర్చాలని సంకల్పంతోనే జెపిఎన్సి కళాశాల ఆవిష్కృతం చేయడం జరిగిందన్నారు. కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ ఎంబీఏ సెకండియర్ పూర్తి చేసిన కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించిన బి.స్వాతిని అభినందిస్తు వారికి రూ.1 లక్ష 50 వేలు అందజేయడం జరిగిందన్నారు. అందరికీ ఉన్నత విద్య అందించాలి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.