20-07-2025 08:11:51 PM
రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలి..
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లు రద్దు చేయాలి..
ప్రజా సమస్యలపై పాత్రికేయులు దృష్టి సారించాలి.. ఐజెయు జాతీయ కౌన్సిల్ సభ్యులు నగునూరి శేఖర్
పెద్దపల్లి (విజయక్రాంతి): తెలంగాణలో ఇక జర్నలిస్టుల సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు నగునూరి శేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని సాయిరాం గార్డెన్ లో ఐజెయు అనుబంధ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(Telangana Working Journalists Union) పెద్దపల్లి జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు మల్లావజ్జుల వంశీ విద్యానంద్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జాతీయ కౌన్సిల్ సభ్యులు నగునూరి శేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి స్థలాల సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం దీనిపై ప్రత్యేక జీవో తీయాలని డిమాండ్ చేశారు.
అక్రిడేషన్ కార్డులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పాత్రికేయులు దృష్టి సారించాలని అన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఇంటి స్థలాల కోసం కార్యాచరణ కోసం ఎమ్యెల్యేలకు, కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేయాలని, ప్రభుత్వ అక్రిడేషన్ కార్డుల మంజూరు కు జీవో వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం టోల్ గేట్ వద్ద ఉచిత వాహన పాస్ ను కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు జర్నలిస్ట్ లకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల పై రాయితీ అయ్యేలా జీవో విడుదల చేయాలనీ, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలనీ, ప్రెస్ క్లబ్ లు లేని చోట ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యూనియన్ భవన నిర్మాణానికి స్థల సేకరణ కు వినతి పత్రాలు అందించాలని, తదితర డిమాండ్ల పరిష్కారంపై తీర్మానం చేయడం జరిగింది.
అనంతరం రామగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సమావేశం విజయవంతం చేసినందుకు రాష్ట్ర, జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడబ్యూజెయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోల లక్ష్మణ్, రాష్ట్ర మప్సిల్ సభ్యులు సామల హరికృష్ణ, రాష్ట్ర సభ్యులు టికె.శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్, కోశాధికారి తగరం రాజు లను ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు పొన్నం శ్రీనివాస్, జిల్లా సహాయకార్యదర్శిలు జ్యోతుల ప్రవీణ్, జబ్బార్ ఖాన్, ఈసి మెంబర్లు చింతం కిరణ్ కుమార్, గాదె బాలు, గసిగంటి రవీందర్, మల్యాల రమేష్, పాత్రికేయులు పివీరావు, బండ సాయి శంకర్, కొడారి మల్లేష్ యాదవ్, కాపర్తి వెంకటేష్, చిలుక సురేష్, పోలు మధు, సూత్రం శ్రీధర్, నల్లూరి లింగయ్య, మల్యాల రమేష్, ఉట్ల తిరుపతి రెడ్డి, ఏకు రవీందర్, దాసరి భరత్, సిద్ధం ప్రదీప్, గాజు రఘుపతి, ఇండ్ల అవినాష్, తదితరులు పాల్గొన్నారు.