calender_icon.png 19 July, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద ఎక్లరా రోడ్డు సమస్యను తీర్చాలని ఎమ్మెల్యేకు వినతి

19-07-2025 02:47:21 PM

జుక్కల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామ పరిధిలోని సబ్ స్టేషన్ ను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం ప్రారంభించారు. అనంతరం పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మాజీ పిఎసిఎస్ చైర్మన్ పండిత్ రావు పటేల్, గ్రామస్తులతో కలిసి తమ గ్రామానికి నూతన బిటి రోడ్డు మంజూరు చేయాలని, రోడ్డు గుంతల మయంగా మారిందని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఖచ్చితంగా పెద్ద క్లారా గ్రామస్తుల కలను నెరవేరుస్తానని అతి త్వరలో గ్రామానికి బీటీ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు.